Minister Anitha: వైసీపీకి ప్రజలు ఇప్పటికే గట్టి బుద్ది చెప్పారు అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వైసీపీ(ysrcp) బాధ్యతారహిత ప్రతిపక్షంగా మారిందని విమర్శించారు. చిన్న పిల్లలతో ‘రప్పా రప్పా’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, మేక తలలు నరికి రక్తాభిషేకాలు చేయించడం ద్వారా నేర ప్రవృత్తిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
లా అండ్ ఆర్డర్ పరిరక్షణ పోలీసుల బాధ్యత కాగా, రౌడీ మూకలను నియంత్రించడం పెద్ద సవాలుగా మారిందని తెలిపారు. పీపీపీ విధానంలో భాగస్వామ్యమైన వారిని అరెస్టు చేస్తామని జగన్(jagan) హెచ్చరించడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.
also read:NIA కార్యాలయం సమీపంలో చైనా రైఫిల్ స్కోప్ లభ్యం..అప్రమత్తమైన భద్రతా దళాలు
గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, రాబోయే ఎన్నికల్లో కూడా అదే తీర్పు ఇస్తారని మంత్రి అనిత స్పష్టం చేశారు.
అదేవిధంగా గతంలో గంజాయి హబ్‌గా మారిన ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
గంజాయి వ్యతిరేక కార్యక్రమాల్లో గత ప్రభుత్వంలో జగన్ ఒక్కసారి కూడా పాల్గొన్నారా అని ప్రశ్నించారు. గంజాయి సాగును జీరో స్థాయికి తీసుకొచ్చామని, అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
వైసీపీ నాయకులపై ఎలాంటి కక్ష సాధింపు లేదని, ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తోందని మంత్రి అనిత పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆమె విమర్శించారు.
