Saturday, March 21, 2026
Google search engine
HomeEducation NewsAmazon Layoffs Alert | టెక్ రంగంలో మరో షాక్‌...16 వేల ఉద్యోగాలు తొలగించే యోచన?

Amazon Layoffs Alert | టెక్ రంగంలో మరో షాక్‌…16 వేల ఉద్యోగాలు తొలగించే యోచన?

-

Google search engine

Amazon Layoffs: ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌లో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు జరగనున్నాయన్న ప్రచారం టెక్ రంగంలో పనిచేసే ఉద్యోగులలో కలకలం రేపుతోంది. వచ్చే వారం దాదాపు 16 వేల మంది ఉద్యోగులను(nearly 16,000 jobs) తొలగించేందుకు కంపెనీ సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు అమెజాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

గతేడాది అమెజాన్‌లో సుమారు 30 వేల ఉద్యోగాలను తొలగిస్తారన్న వార్తలు విస్తృతంగా ప్రచారం కాగా, అనంతరం సంస్థ 14 వేల మంది ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం అమెజాన్‌లో దాదాపు 3.5 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు పనిచేస్తుండగా, తాజా లేఆఫ్స్ అమలైతే మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

ఈ తాజా ఉద్యోగాల కోతలు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్, ప్రైమ్ వీడియోతో పాటు మానవ వనరుల (HR) విభాగాలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థకు సంబంధించిన వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యయ నియంత్రణ, వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టెక్ రంగంలో ఇప్పటికే లేఆఫ్స్ కొనసాగుతున్న నేపథ్యంలో, అమెజాన్ నుంచి వచ్చే తుది ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ:T20 World Cup | బంగ్లాకు తప్పని తిప్పలు తప్పుకుంటే ఏకంగా రూ.325 కోట్ల నష్టం

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine