ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి కర్నూలు జిల్లా నందు ప్రభుత్వ నిషేధిత జనశక్తి దళ ఏర్పాటుకై నిందితులు ఆర్థికంగా మరియు ఆయుధపరంగా దళం పునర్నిర్మాణం చేస్తుండగా ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పక్క సమాచారంతో వారిని పట్టుకుని వారి ఆలోచనలను ఏర్పాటను విచ్ఛిన్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటుచేసిన సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ A1 వెంకటరెడ్డి ముఖ్యంగా గతంలో జనశక్తి పార్టీలో పనిచేసి అరెస్టు అవడం జరిగింది.
సూర్యాపేట జిల్లా తన మిత్రుడి హత్య కేసుకు ప్రతీకార చర్యగా, అదేవిధంగా జనశక్తి పార్టీని తిరిగి ఉమ్మడి కర్నూలు జిల్లా నందు స్థాపితం చేయడానికి నల్లగంటి ప్రసన్నరాజు ఆర్థిక సహాయం చేయగా A1 వెంకటరెడ్డి మరియు తన అనుచరుడు A3 హేమ కాంత్ రెడ్డి కలిసి A2 దిలీప్ మరియు అతని రెస్టారెంట్ లో పనిచేసే భైరవ్ చెప్పిన వ్యక్తితో కలిసి కాశీకి వెళ్లి ఉండగా, వారితో వచ్చిన వ్యక్తి బీహార్ రాష్ట్రం మృంగార్ రైల్వే స్టేషన్ కు వెళ్లి పిస్టల్స్ మరియు బుల్లెట్లను సేకరించి తిరిగి కాశీకి వచ్చి, తిరిగి వెళ్లే క్రమంలో ఆదిలాబాద్ జిల్లా చాంద T బైపాస్ రోడ్డు వద్ద పక్కా సమాచారంతో ఆదిలాబాద్ రూరల్ ఎస్సై ముజాహిద్ మరియు సిబ్బంది కలిసి తనిఖీ చేయగా A 2 దిలీప్ మరియు A3 హిమ కాంత్ రెడ్డి లు నాలుగు 7.65 mm పిస్టల్స్, 8 మ్యాగజైన్లు, 18 లైవ్ రౌండ్ లను, మరియు వారు ప్రయాణించిన కారును స్వాధీనం చేసుకొని ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు.
వీరందరిపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 231/2024 తో sec 61(2)(a), 109 (1) R/W 3(5) BNS, sec 25(1A) arms act, 1959. ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. దర్యాప్తులో భాగంగా గురువారం రాత్రి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సూత్రధారి A1 వెంకట్ రెడ్డి మరియు మరియు పిస్టల్స్ కొనుగోలుకు ఆర్థిక సహాయం చేసిన A4 ప్రసన్న రాజుల ను గత రాత్రి అరెస్టు చేసి ఈరోజు ఉదయం రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది.
ముఖ్యంగా ఈ కేసు నందు A2 మైల దిలీప్ శ్రీశైలం రుచులు అనే రెస్టారెంట్ ఏర్పాటు అనుమతులపై తనకు పరిచయమున్న A1 వెంకటరెడ్డికి సున్నిపెంట గ్రామం నందు ఆదిత్య రెస్టారెంట్ యజమాని ని సహాయం కోరడం జరిగింది. తదుపరి మైల దిలీప్ రెస్టారెంట్లో పని చేసే బీహార్ వాస్తవ్యుడైన భైరవతో బేరాన్ని ఏర్పాటు చేసుకొని, A1 వెంకటరెడ్డి ఇంటి నుండి A4 నల్లగంటి ప్రసన్న రాజు చేసిన ఆర్థిక సహాయంతో డబ్బులను తీసుకొని A2 దిలీప్ మరియు A3 హిమకాంత్ రెడ్డి, కుక్ భైరవ్ చెప్పిన వ్యక్తి సహాయంతో కాశి కి వెళ్లి అక్కడ రెండు రోజులపాటు ఉండి బీహార్ మృంగిర్ రైల్వే స్టేషన్ లో పిస్టల్స్ ను తీసుకొని ఆదిలాబాద్ మీదుగా తిరిగి వస్తున్న క్రమకంలో ఈ అరెస్టు జరిగిందని తెలిపారు.
A1 వెంకట్ రెడ్డి పై ఇదివరకే టాడా కేసు, వివిధ సంఘవిద్రోవశక్తుల కేసులలో, హత్య కేసులలో కీలక పాత్రగా వ్యవహరిస్తున్నట్లు ఇదివరకే ఇతనిపై మూడు హత్య కేసులు, ఒక హత్య ప్రయత్నం కేసు, నాలుగు జనశక్తి కి సంబంధించిన కేసులు,రెండు టాడా కేసులు మొత్తం 10 కేసులలో పాత్ర ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అదేవిధంగా మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలకు పంపడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆదిలాబాద్ జిల్లా పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డి.ఎస్.పి ఎల్ జీవన్ రెడ్డి, సిఐలు కే ఫణిదర్, కరుణాకర్, డి సాయినాథ్, ఎస్సైలు ముజాహిద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అరెస్ట్ అయిన నిందితులు.
1) వోట్టి వెంకటరెడ్డి s/o శశి రెడ్డి, సున్నిపెంట గ్రామం, నంద్యాల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
2) మైల దిలీప్ s/o తులసిరం, గ్రామం సున్నిపెంట, జిల్లా నంద్యాల, ఆంధ్ర ప్రదేశ్.
3) అవులపాటి హిమ కాంత్ రెడ్డి s/o బుసిరెడ్డి, నంద్యాల జిల్లా.
4) నల్లగంటి ప్రసన్నరాజు s/o నల్ల గంటి బిక్షం, నకిరేకల్, నల్గొండ జిల్లా.
స్వాధీనపరచుకున్నవి
1) పిస్టల్స్ – 4
2) మ్యాగ్జిన్స్ – 8
3) లైవ్ రౌండ్స్ – 18
4) సెల్ ఫోన్స్ – 5
5) కార్ – 1 (I 20 – ts07jq9592)
