Accenture: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో టెక్ రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ ఐటి దిగ్గజం యాక్సెంచర్(Accenture) కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ స్థాయి ఉద్యోగులు ఏఐ టూల్స్ వినియోగించకపోతే ప్రమోషన్లు ఉండవని స్పష్టం చేసింది. ఇప్పటికే వేలాది ఉద్యోగులను తగ్గించిన సంస్థ, ఇప్పుడు లీడర్‌షిప్ పాత్రలకు ఏఐ వినియోగం తప్పనిసరి అని ప్రకటించింది.
అసోసియేట్ డైరెక్టర్లు, సీనియర్ మేనేజర్లకు ఈ మేరకు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఈఓ Julie Sweet సంస్థల పని విధానాలు పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏఐ ఆధారంగా వర్క్‌ఫోర్స్‌ను తీర్చిదిద్దాలని సూచించారు.
ఇదే దారిలో Microsoft, Meta, Google వంటి సంస్థలు కూడా ఉద్యోగులు ఏఐను తప్పనిసరిగా వినియోగించాలంటూ హెచ్చరిస్తున్నాయి. టెక్ రంగంలో ఏఐ వాడకం ఇకపై ఆప్షన్ కాదు, అవసరం అని స్పష్టం అవుతోంది.
ALSO READ:బిట్‌కాయిన్ మనీలాండరింగ్ కేసులో – రాజ్ కుంద్రాకు ముంబయి కోర్టు ఊరట








