భీమన్న గుట్ట సాయిబాబా సొసైటీకి 2004లో మంచిర్యాల్ మైనింగ్ నిర్మల్ అర్బన్ తాసిల్దార్ గారు పర్మిషన్ ఇచ్చారు. అయితే, ఇటీవలకాలంలో వారి టాక్టర్లను జెసిపిలు సీజ్ చేసి, ఫైన్ వేయడం జరిగింది. దీనిపై సంఘం, ట్రస్ట్ అధికారులు స్పందించారు. ఈ అంశం నిన్నాళ్ళలో నిర్మల్ జిల్లా డైరెక్టర్ వల్లపు శివ భూపతి గారి దృష్టికి తీసుకొచ్చారు.
ఈ విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్న డైరెక్టర్, తెలంగాణ చైర్మన్ గారి ఆదేశాల మేరకు, వైస్ చైర్మన్ ఎత్తరి అంతయ్య గారు వడ్డెర ఆత్మగౌరవ భవన సముదాయ ట్రస్ట్ ప్రాంతాన్ని సందర్శించి, స్థానిక కుల సోదరులకు ధైర్యం ఇచ్చారు. అలాగే, రెవిన్యూ అధికారులతో కలసి వడ్డెళ్ళకు ఉన్న హక్కులను వివరించారు.
ఈ సందర్భంగా, డైరెక్టర్ దాదాపు ప్రభుత్వం తరఫున ఇచ్చిన అన్ని హక్కులను స్ఫష్టంగా పేర్కొన్నాడు. “మీకు ఎటువంటి సమస్యలున్నా, ప్రభుత్వం ద్వారా మీకు సహాయం అందించేందుకు ప్రయత్నిస్తాము” అని వారికి ధైర్యం ఇచ్చారు. వారు కార్యాలయ పనులను సక్రమంగా సాగించేందుకు హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఒల్లెపువ్వు శెట్టి, విడగొట్టి, సంజు సంపంగి, గంగాధర్ వల్లపు, దుర్గ రాజన్న, రాజన్న పాలకుంట నగేష్ కొముర గంగన్న తదితరులు పాల్గొన్నారు.