టాలీవుడ్ నటుడు శ్రీతేజ్‌పై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో మోసపూరిత వివాహ ఆరోపణల కింద కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై బీఎన్‌ఎస్ 69, 115 (2), 318 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
గతంలోనూ శ్రీతేజ్‌పై ఇదే పోలీస్ స్టేషన్‌లో మరో వివాదాస్పద కేసు నమోదైంది. ఆ వివాదంలో వివాహేతర సంబంధం కారణంగా ఒక మహిళ భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది.
శ్రీతేజ్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో చంద్రబాబు పాత్ర పోషించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ‘ధమాకా’, ‘పుష్ప ది రైజ్’, ‘వంగవీటి’, ‘మంగళవారం’ తదితర సినిమాల్లో ముఖ్య పాత్రలు చేసి మంచి గుర్తింపు పొందాడు.
ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ చిత్రంలో కూడా శ్రీతేజ్ పాత్ర పోషిస్తున్నాడు. అయితే తాజాగా కేసు నమోదవడంతో ఈ అంశం టాలీవుడ్‌లో మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఈ ఆరోపణలపై ఆయన ఎలా స్పందిస్తారనేది చూడాలి.