సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ లో గురువారం సద్దుల బతుకమ్మ సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు పాండవుల చెరువు వద్ద భారీ ఏర్పాట్లు చేశారు రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో అట్టహాసంగా నిర్వహించారు, మున్సిపల్ పరిధిలోని అన్ని చెరువుల వద్ద అతిపెద్ద బతుకమ్మ ఏర్పాటు చేసి ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు, పువ్వులతో ప్రత్యేకంగా ఉన్న పెద్ద బతుకమ్మలను బహుమతి జ్యూట్ బ్యాగ్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి,మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, మున్సిపల్ పాలక వర్గం సభ్యులు,నాయకులు డాక్టర్ నరేష్ బాబు, కొట్టాల యాదగిరి, బొగ్గుల సురేష్, న్యాయవాది తలకొక్కుల రాజు,యువ నాయకుడు ఎన్ సీ సంతోష్, లయన్స్ క్లబ్ సభ్యులు, పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు
గజ్వేల్ మున్సిపల్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
