నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గమ్మ వారు లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమం అనంతరంగ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి, అనూప్ శర్మ,హరికేష్ శర్మ,ల ఆధ్వర్యంలో మహా చండీ హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ దుర్గామాత ఉత్సవ కమిటీ 20వ వార్షికోత్సవంలో భాగంగా మహా చండీ హోమ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ 20 వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మహా చండీ హోమ కార్యక్రమం చేపట్టామన్నారు. ఆ అమ్మవారి కృపతో గ్రామ ప్రజలు అష్ట ఆయురారోగ్యాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ దుర్గమ్మ వారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలోఎస్సై శ్రీనివాస్ రెడ్డి, దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులు కరుణాకర్, కోశాధికారి చంద్రకాంత్ గౌడ్,వెంకట్ రెడ్డి,మౌరం రాజు, చల్మేటి నాగరాజు, తిరుమల గౌడ్, రంజిత్ గౌడ్,సిద్ధ రాంరెడ్డి, జిపి స్వామి,ప్రభాకర్,శివ, స్వాములు తదితరులు పాల్గొన్నారు
దుర్గమ్మ వారి 20వ వార్షికోత్సవంలో మహా చండీ హోమం
