Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeNationalE20 పెట్రోల్‌పై కేంద్రం క్లారిటీ.. ఇంజిన్ దెబ్బతింటుందా? అసలు నిజం ఇదే

E20 పెట్రోల్‌పై కేంద్రం క్లారిటీ.. ఇంజిన్ దెబ్బతింటుందా? అసలు నిజం ఇదే

-

Chat on WhatsApp

E20 Petrol: ఈ20 పెట్రోల్‌ వాడితే వాహనాల ఇంజిన్‌లు దెబ్బతింటాయనే ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. అలాంటి వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని రాజ్యసభలో స్పష్టం చేసింది. అయితే ఈ10 పెట్రోల్‌కు అనుగుణంగా తయారైన పాత వాహనాల్లో ఈ20 వినియోగిస్తే మైలేజీ 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడించింది. అయితే అది కూడా కేవలం ఇథనాల్‌ శాతం వల్ల మాత్రమే కాదని, డ్రైవింగ్‌ విధానం, వాహనం నిర్వహణ, టైర్లలో గాలి ఒత్తిడి, వీల్‌ అలైన్‌మెంట్‌, ఏసీ వినియోగం వంటి అనేక అంశాలు ఇంధన వినియోగాన్ని ప్రభావితం చేస్తాయని తెలిపింది.

మరోవైపు ఈ20 పెట్రోల్‌ వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. ఈ20 పెట్రోల్‌ వాడటం వల్ల ఇంధనం సమర్థంగా దహనం కావడంతో ఇంజిన్ పనితీరు మెరుగుపడటంతో పాటు, నాకింగ్ సమస్య తగ్గి వాహనం మరింత సాఫీగా నడుస్తుందని కేంద్రం తెలిపింది. ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఈ20 పెట్రోల్‌ వల్ల ఏ వాహనం ఇంజిన్‌ దెబ్బతిన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని, దీనిపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sonam Wangchuk | ‘వారిపై కేసులు వద్దు’.. దీక్ష విరమణకు వాంగ్‌చుక్ ఒక్కటే డిమాండ్

Sonam Wangchuk: నీట్ పరీక్షల వ్యవహారంపై కొనసాగుతున్న ఆందోళనలకు కొత్త మలుపు వచ్చింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, తన దీక్ష విరమణకు ఒక కీలక షరతు...
- Advertisement -
Chat on WhatsApp