రహస్య కలయిక; వివాహం దాకా దారితీసిన గొడవ

Secret Lovers Stock Illustrations – 440 Secret Lovers Stock Illustrations,  Vectors & Clipart - Dreamstime

అర్ధరాత్రి ఓ పార్క్‌లో రహస్యంగా కలుసుకున్న ప్రేమ జంటను పట్టుకున్న గ్రామస్థులు చితకబాదారు. విషయం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత మరింత గొడవ చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి  వెళ్తే.. ఇరుగుపొరుగు ఇళ్ల వారైన యువతి, యువకుడు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గ్రామ శివారులోని పార్క్‌లో రాత్రివేళ రహస్యంగా కలుసుకోవాలని ప్లాన్ చేశారు. ఆమెను ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా? అన్న ఆత్రుతలో ఉన్న యువకుడు అర్ధరాత్రి పార్క్‌కు చేరుకున్నాడు. అయితే, ఆ తర్వాత జరిగే పరిణామాన్ని ఊహించలేకపోయాడు. 

అయితే, అప్పటికే వీరి రహస్య కలయిక ప్రణాళిక గ్రామస్థుల చెవిలో పడింది. దీంతో వారిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే వారిని రహస్యంగా అనుసరించి పార్కులో ఇద్దరినీ పట్టుకుని కర్రలతో చితకబాదారు. అది అక్కడితో ఆగలేదు. విషయాన్ని వారి తల్లిదండ్రులకు చేరవేసి రప్పించారు. అక్కడకు చేరుకున్న బాలిక కుటుంబ సభ్యులు అబ్బాయి తమ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ఒక్కసారిగా వారి నోటివెంట వచ్చిన ఈ ప్రతిపాదనకు యువకుడి కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. ఇది మరింత గొడవకు కారణమైంది. అమ్మాయి తరపు బంధువులు కుర్రాడిని తమ అదుపులోకి తీసుకుని రాతంత్రా బంధించారు. పెళ్లి చేసుకుంటానని అంగీకరించే వరకు అతడిని విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఘర్షణ రోజంతా కొనసాగింది. చివరికి పెళ్లికి అంగీకరించడంతో అతడిని విడిచిపెట్టారు. ఇంత గొడవ జరిగిన స్థానిక పోలీసులు మాత్రం జోక్యం చేసుకోలేదు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *