Sunday, March 29, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadHyderabad Traffic | హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్.. శ్రీరామనవమి శోభాయాత్రతో పలు రూట్లు బంద్

Hyderabad Traffic | హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్.. శ్రీరామనవమి శోభాయాత్రతో పలు రూట్లు బంద్

-

Chat on WhatsApp

Hyderabad Traffic: హైదరాబాద్‌లో నేడు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతుండగా, నగరంలో ప్రత్యేకంగా శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహించనున్నారు.

ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్‌, ఆకాశ్‌పురి హనుమాన్ ఆలయం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో సుల్తాన్‌బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ శోభాయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా పోలీసులు 3 వేల మంది సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

శోభాయాత్ర దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సీతారాంబాగ్ బోయగూడ కమాన్ నుంచి వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు మళ్లిస్తారు.

మంగళ్‌హాట్, గాంధీ విగ్రహం, పురానాపూల్, జుమేరాత్ బజార్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను టక్కర్‌వాడీ జంక్షన్ వైపు డైవర్ట్ చేస్తారు. అలాగే ఎంజే బ్రిడ్జ్, బేగంబజార్, అఫ్జల్‌గంజ్, సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలను జుమ్మేరాత్ బజార్ మీదుగా మళ్లిస్తారు.

అబిడ్స్ జీపీఓ, సుల్తాన్ బజార్, కోఠి, అబిడ్స్ ప్రధాన రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయనున్నారు. బేగంబజార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, కోఠి, కాచిగూడ, అబిడ్స్ ప్రాంతాలకు వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. యాత్ర సాగే ప్రాంతాల్లో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండి పోలీసుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana cm revanth reddy launching tholi mudda breakfast scheme for anganwadi children in assembly premises

Anganwadi Breakfast Scheme | సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త పథకం.....

Anganwadi Breakfast Scheme: తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని మెరుగుపరచే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ‘తొలి ముద్ద’(Tholi Mudda) పేరుతో ప్రత్యేక...
- Advertisement -
Chat on WhatsApp