Wednesday, March 18, 2026
No menu items!
spot_img
HomeInterNationalUSA | యుఎస్‌లో అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్...ఏకంగా 2,600 డాలర్లు

USA | యుఎస్‌లో అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్…ఏకంగా 2,600 డాలర్లు

- Advertisement -
Google search engine

USA: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు(illegal immigrants) కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయమైన కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. స్వచ్ఛందంగా దేశాన్ని విడిచిపెట్టి తమ స్వదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యే వారికి 2,600 డాలర్ల వరకు ఎగ్జిట్ బోనస్ ఇవ్వనున్నట్లు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. అదనంగా, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఉచిత విమాన టికెట్లు కూడా అందిస్తామని తెలిపింది.

ఈ ప్రక్రియను సులభంగా నిర్వహించేందుకు ‘CBP Home’ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ ద్వారా తమ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమని నమోదు చేసుకున్నవారిని బలవంతపు డిపోర్టేషన్ జాబితా నుంచి తొలగిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీని ద్వారా అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా వెళ్లేలా ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇకపోతే, 2025 జనవరి నుంచి ప్రారంభమైన ఈ చర్యల ఫలితంగా ఇప్పటివరకు 22 లక్షలకు పైగా వలసదారులు తమ దేశాలకు తిరిగి వెళ్లినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రకారం, ఈ మార్గం ద్వారా వెళ్లడం సురక్షితమైనదిగా, తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా ఉంటుంది.

అలాగే అరెస్టులు, న్యాయ సమస్యలు వంటి ఇబ్బందులను కూడా నివారించవచ్చని సూచించింది. ఈ నిర్ణయం అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంలో కీలక మార్పుగా భావిస్తున్నారు.

- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

- Advertisement -