Wednesday, March 18, 2026
No menu items!
spot_img
HomeNational Bengaluru Courier Bag Incident | కొరియర్ బస్తాలో వృద్ధుడు!...ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు

 Bengaluru Courier Bag Incident | కొరియర్ బస్తాలో వృద్ధుడు!…ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు

- Advertisement -
Google search engine

Bengaluru: బెంగళూరులో చోటుచేసుకున్న ఓ దారుణమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీల్స్ కోసం మానవత్వాన్ని మరచిపోయి ఒక కుటుంబం, బస్సు టికెట్లు దొరకలేదని తమ వృద్ధుడిని ఏకంగా గోనె బస్తాలో కడిగి, కదలకుండా కట్టేసి కొరియర్‌ ద్వారా పంపించేందుకు ప్రయత్నించింది.

కొరియర్ సిబ్బంది బస్తాలో ఏదో కదులుతున్నట్టు గమనించి మూటను తెరచగా, ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న వృద్ధుడిని చూసి షాక్ అయ్యారు. కుటుంబ సభ్యులు ‘టికెట్లు లభించకపోవడం కారణంగా పార్సిల్ చేయాల్సి వచ్చింది’ అని చెప్పగా, పోలీసులు వెంటనే చేరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో, కుటుంబం తమ తప్పును అంగీకరించి క్షమాపణలు తెలిపింది.

ఈ సంఘటనను ఎవరో వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్స్ రీల్స్ మోజులో పడి ఫేమస్ అవడం కోసం పెద్దలు, పిల్లల ప్రాణాలను రక్షించకుండా ప్రమాదంలో పడేసే పరిస్థితులను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు శిక్ష, అవగాహన అవసరమని వారు చెప్పారు. ఈ ఘటన మానవత్వం, సామాజిక బాధ్యతలపై ప్రశ్నలను ఎదుర్కొంటుంది.

- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

- Advertisement -