Thursday, March 19, 2026
No menu items!
spot_img
HomeInterNationalKabul Hospital | రంజాన్ వేళ దాడి అమానుషం...పిరికిపంద చర్య అభివర్ణించిన భారత్

Kabul Hospital | రంజాన్ వేళ దాడి అమానుషం…పిరికిపంద చర్య అభివర్ణించిన భారత్

-

Kabul Hospital: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్(Kabul) లోని ఒక ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడి జరపడం పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను పిరికిపంద చర్యగా, అమానుష దాడిగా అభివర్ణిస్తూ ఖండించింది. ముఖ్యంగా పవిత్ర రంజాన్ సమయంలో ఇలాంటి దాడులు జరగడం మరింత బాధాకరమని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ Ministry of External Affairs అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రకటనలో పాకిస్థాన్ తన చర్యలను సైనిక ఆపరేషన్‌గా చూపించడానికి ప్రయత్నిస్తున్నదని, కానీ ఇది పూర్తిగా అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారంపై దాడి అని భారత్ స్పష్టం చేసింది. ఈ రకమైన నిర్లక్ష్యపూరిత, హింసాత్మక చర్యలు ప్రాంతీయ శాంతి, భద్రతలకు తీవ్ర ముప్పు అని హెచ్చరించింది. తమ అంతర్గత సమస్యలను దాచిపెట్టేందుకు పాకిస్థాన్ ఇతర దేశాలపై దాడులు చేస్తోందని కూడా విమర్శించింది.

అఫ్గానిస్థాన్ భౌగోళిక సమగ్రతకు భారత్ ఎప్పటికీ మద్దతుగా ఉంటుందని, ఈ క్లిష్ట సమయంలో అక్కడి ప్రజలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

ఇదిలా ఉండగా, మాదకద్రవ్యాల బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్న కాబుల్‌లోని ఆసుపత్రిపై సోమవారం రాత్రి ఈ దాడి జరిగింది. అఫ్గానిస్థాన్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో దాదాపు 400 మంది మృతి చెందగా, భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర స్థాయిలో ఆందోళన వక్త్యం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisment -

Must Read

stock market crash graph showing sharp fall in sensex and nifty indices

Stock market crash | స్టాక్ మార్కెట్ బ్లడ్ బాత్: నిఫ్టి, సెన్సెక్స్ భారీ...

Stock market crash: ఉగాది పర్వదినం సందర్భంగా లాభాల ఆశతో ఉన్న ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ భారీ షాక్ ఇచ్చింది. నిఫ్టి, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టి సూచీలు తీవ్రంగా పతనమై మార్కెట్‌లో ‘బ్లడ్...