Saturday, April 18, 2026
Chat on WhatsApp
HomeSportsRinku Singh | రింకు సింగ్‌కు తీరని లోటు...హర్భజన్ సింగ్ సంతాపం

Rinku Singh | రింకు సింగ్‌కు తీరని లోటు…హర్భజన్ సింగ్ సంతాపం

-

Chat on WhatsApp

Rinku Singh: టీమ్ఇండియా క్రికెటర్‌ రింకు సింగ్‌(Rinku Singh) కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఖాన్‌చంద్‌ సింగ్‌ శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా స్టేజ్‌-4 లివర్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల విషమించింది.

నోయిడాలోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ కారణంగా జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు రింకు జట్టును తాత్కాలికంగా వీడగా, అనంతరం మళ్లీ టీమ్‌తో కలిశాడు.

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌కు చెందిన ఖాన్‌చంద్‌ సింగ్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ డెలివరీ విభాగంలో పనిచేసేవారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రింకు సింగ్‌ క్రికెట్‌లో ఎదగడానికి ఆయన తండ్రి కీలక పాత్ర పోషించారు. కష్టసుఖాల్లో అండగా నిలిచిన తండ్రి మృ**తి రింకు కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది.

ఈ విషాదంపై మాజీ భారత క్రికెటర్‌ హర్భజన్ సింగ్(Harbhajan Singh) స్పందించారు. ఎక్స్‌ వేదికగా సంతాపం తెలియజేస్తూ, “రింకు సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ జీ మరణవార్త విని చాలా బాధపడ్డాను.

ఈ కఠిన సమయంలో రింకు కుటుంబానికి ధైర్యం కలగాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. క్రికెట్ వర్గాలు, అభిమానులు రింకు కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.

ALSO READ:అసెంబ్లీ ఎన్నికల ముందు తమిళ రాజకీయాల్లో ట్విస్ట్…పార్టీ మారిన పన్నీర్ సెల్వం

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

oil tanker navigating through strait of hormuz amid iran naval tensions

Iran | ట్యాంకర్‌పై కాల్పులు.. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం?

Iran: ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు ఒక చమురు ట్యాంకర్‌పై కాల్పులు జరపడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన ప్రపంచ...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102