Thursday, March 26, 2026
Chat on WhatsApp
HomeInterNationalOracle Layoffs | ఏఐ ఎఫెక్ట్‌.. ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌?

Oracle Layoffs | ఏఐ ఎఫెక్ట్‌.. ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌?

-

Chat on WhatsApp

Oracle Layoffs: మోన్న అమెజాన్ నేడు ఒరాకిల్ AI ఎఫెక్ట్ తో ఉడుతున్న ఉద్యోగాలు. ప్రపంచవ్యాప్తంగా టెక్‌ రంగంలో లేఆఫ్స్‌ భయం మరింత పెరుగుతోంది. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వేగంగా విస్తరిస్తుండగా, మరోవైపు అదే ఏఐ ప్రాజెక్టుల కోసం నిధులు సమకూర్చుకునేందుకు టెక్‌ కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నాయి.

ఈ క్రమంలో ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఒకటైన ఒరాకిల్‌ (Oracle) కూడా భారీ లేఆఫ్స్‌పై ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అంతర్జాతీయ పరిణామాలు, అమెరికాలో ట్రంప్ పాలసీల ప్రభావం, పెట్టుబడుల కొరత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఖర్చులు తగ్గించుకోవాలని ఒరాకిల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐ పేరిట ఉద్యోగాల కోత మొదలైన నేపథ్యంలో, ఇప్పుడు మలి విడత లేఆఫ్స్‌పై దృష్టి పెట్టినట్లు టెక్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఏఐ డేటా సెంటర్లకు నిధులు సమకూర్చేందుకు ఒరాకిల్‌ సుమారు 20 నుంచి 30 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశముందని ఓ నివేదిక వెల్లడించింది. ఈ వార్త వెలువడగానే సంస్థ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎవరిపై వేటు పడుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది.

లేఆఫ్స్‌ ద్వారా ఆదా అయ్యే నిధులను ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి వినియోగించాలన్నది సంస్థ యోచనగా తెలుస్తోంది. టీడీ కోవెన్‌ రూపొందించిన పరిశోధనా నివేదిక ప్రకారం, ఒరాకిల్‌కు ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణకు సుమారు 156 బిలియన్‌ డాలర్లు అవసరమవుతాయని అంచనా. అయితే అంత భారీ పెట్టుబడులకు బ్యాంకులు, ఇన్వెస్టర్లు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

గతేడాది చివర్లోనే రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా 10 వేల మంది ఉద్యోగులను ఒరాకిల్‌ తొలగించింది. భారత్‌లో బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, ముంబై వంటి నగరాల్లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తుండటంతో, తాజా లేఆఫ్స్‌ వార్తలు టెక్కీల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ ప్రచారంపై ఒరాకిల్‌ అధికారికంగా స్పందించలేదు.

ALSO READ:Allari Naresh Property Registration | నిడదవోలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అల్లరి నరేష్‌ – ఆర్యన్ రాజేష్

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp