Saturday, March 21, 2026
Google search engine
HomeFilms NewsKalki 2 Movie Update | కల్కి 2: దీపికా స్థానంలో సాయి పల్లవి వస్తారా?

Kalki 2 Movie Update | కల్కి 2: దీపికా స్థానంలో సాయి పల్లవి వస్తారా?

-

Google search engine

Kalki 2 Movie Update: కల్కి సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరి ఇండియన్ సినిమా చరిత్రలో మరో ఘనతను సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు అలాంటి బ్లాక్‌బస్టర్ ఇదే కావడం విశేషం.

ఇక కల్కి సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించి కీలక పాత్రలో మెప్పించింది. అయితే తాజా సమాచారం ప్రకారం కల్కి(Kalki 2) సీక్వెల్ నుంచి దీపికా తప్పుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

స్పిరిట్ సినిమా నుంచి కూడా దీపికా బయటకు రావడంతో ఆమె భవిష్యత్ ప్రాజెక్టులపై చర్చలు ఊపందుకున్నాయి. దీంతో కల్కి 2లో దీపికా ప్లేస్‌లో ఎవరు నటిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఆమె పాత్రను కొనసాగిస్తారా లేక పూర్తిగా కొత్త క్యారెక్టర్ డిజైన్ చేస్తారా అనే అంశంపై స్పష్టత లేదు.

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో సాయి పల్లవి పేరు గట్టిగా వినిపిస్తోంది. దీపికా పాత్రకు సాయి పల్లవి అయితే న్యాయం చేస్తుందని, ఆమెనే ప్రభాస్ సరసన ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

సాయి పల్లవి ప్రస్తుతం రామాయణం, ఏక్ దిన్ వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. కల్కి 2లో ఆమె ఎంట్రీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదప్పటికీ, ఈ వార్త అభిమానుల్లో భారీ ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్ చేస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత అన్నది మేకర్స్ వెల్లడిస్తేనే తేలనుంది.

also read:China Bangladesh Defence | చైనా–బంగ్లాదేశ్ రక్షణ ఒప్పందం…భారత్ అప్రమత్తమవ్వాలా?

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

windows 11 laptop showing no internet error after microsoft update during sign in

Windows 11 |  విండోస్ 11 అప్‌డేట్ గందరగోళం.. ‘నో ఇంటర్నెట్’ ఎర్రర్‌తో యూజర్లకు...

Windows 11: మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన తాజా విండోస్ 11 అప్‌డేట్ వినియోగదారులకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా 24H2, 25H2 వెర్షన్‌లలో మార్చి 10, 2026న విడుదలైన KB5079473 అప్‌డేట్ తర్వాత కొంతమంది...
- Advertisement -
Google search engine