Saturday, March 21, 2026
Google search engine
HomeAndhra PradeshRepublic Day 2026: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Republic Day 2026: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

-

Google search engine

Republic Day 2026: దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక వైభవంతో రిపబ్లిక్ డే (Republic Day) కార్యక్రమాలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(
Jishnu Dev Varma) ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ బలగాలు, ఎన్‌సీసీ కేడెట్లు నిర్వహించిన మార్చ్‌పాస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, డీజీపీ శివధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.

పరేడ్‌లో 11 విభాగాలు పాల్గొనగా, రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా 22 శకటాలను ప్రదర్శించారు. ఈ చారిత్రక వేడుకలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

ALSO READ:Telangana Police Medals 2026: గణతంత్ర దినోత్సవానికి 23 మందికి పురస్కారాలు

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine