Monday, March 23, 2026
Google search engine
HomeFilms NewsSwayambhu Movie Update: స్వయంభూ’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

Swayambhu Movie Update: స్వయంభూ’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

-

Google search engine

Swayambhu Movie: యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం “స్వయంభూ”. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఒక యోధుడి పాత్రలో కనిపించేందుకు నిఖిల్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకొని, విదేశాల్లో “కత్తిసాము, గుర్రపు స్వారీ, ఆర్చరీ”వంటి యుద్ధ కళల్లో ప్రత్యేక శిక్షణ పొందారు.

పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విజువల్స్ పరంగా హాలీవుడ్ స్థాయిని అందుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి.

తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీపై స్పష్టత ఇచ్చారు. “స్వయంభూ’ చిత్రం 2026 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.” ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, “రవి బస్రూర్” సంగీతం అందిస్తున్నారు. ఈ చారిత్రక యాక్షన్ గాథ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

also read:US Tariffs on India | భారత్–అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine