Thursday, March 26, 2026
Chat on WhatsApp
HomeKeralaPrakash Raj Meets Sunita Williams | సునీతా విలియమ్స్‌ను కలిసిన ప్రకాశ్ రాజ్.. ఫోటోలు వైరల్

Prakash Raj Meets Sunita Williams | సునీతా విలియమ్స్‌ను కలిసిన ప్రకాశ్ రాజ్.. ఫోటోలు వైరల్

-

Chat on WhatsApp

KLF 2026: కేరళలోని కోజికోడ్‌లో జరుగుతున్న కేరళ లిటరేచర్ ఫెస్టివల్ 2026 (KLF 2026) ఓ అపురూప ఘట్టానికి వేదికైంది. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్‌(Sunita Williams)ను ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) ప్రత్యేకంగా కలుసుకున్నారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సునీతా విలియమ్స్‌తో గడిపిన క్షణాలను ప్రకాశ్ రాజ్ తన సోషల్ మీడియాలో  పోస్ట్ చేసారు.

ఇటీవలే నాసా(NASA) నుంచి పదవీ విరమణ పొందిన సునీతా విలియమ్స్ భారత పర్యటనలో భాగంగా ఈ సాహిత్య ఉత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెతో సమావేశం కావడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్న అని  ప్రకాశ్ రాజ్ తెలిపారు.

“ఈ తరం ఎంతో మందికి స్ఫూర్తి, అత్యంత ధైర్యవంతురాలైన మహిళను కలవడం గర్వంగా ఉంది. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి” అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.


ప్రకాశ్ రాజ్ – సునీతా విలియమ్స్ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అరుదైన సమావేశం KLF 2026 ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

ALSO READ:Amazon Layoffs Alert | టెక్ రంగంలో మరో షాక్‌…16 వేల ఉద్యోగాలు తొలగించే యోచన?

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp