Monday, March 23, 2026
Google search engine
HomeInterNationalUnited Airlines | ల్యాండింగ్ సమయంలో ఊడిన టైర్...తప్పిన ప్రమాదం

United Airlines | ల్యాండింగ్ సమయంలో ఊడిన టైర్…తప్పిన ప్రమాదం

-

Google search engine

United Airlines: అమెరికాలో ఓ భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయం(Orlando International Airport)లో ల్యాండ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది.

ల్యాండింగ్ సమయంలో విమానానికి సంబంధించిన ముందు చక్రం ఊడిపోయి రన్‌వేపై పడిపోయింది. ఒక్కసారిగా ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు.

చికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 206 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఈ విమానం ఓర్లాండో చేరుకునే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ALSO READ:Rashmika Mandanna Japan | జపాన్ అభిమానుల ప్రేమకు ఫిదా అయిన నేషనల్ క్రష్..ఎమోషనల్ పోస్ట్ 
అయితే అప్రమత్తమైన పైలట్ నైపుణ్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి బయటకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు.

విమానం రన్‌వేపై నిలిచిపోవడంతో దాన్ని తొలగించేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాలను మోహరించినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు వెల్లడించారు.

ఈ కారణంగా కొంతసేపు పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. సాంకేతిక లోపానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని, ఓర్లాండోలోని ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా దీనికి కారణం కావచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine