వందేళ్ల చరిత్రలో తొలిసారిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(Rjinikanth)కు ఆంగ్ల పత్రిక నుంచి అరుదైన గౌరవం లభించింది. దేశంలోని ప్రముఖ ఆంగ్ల పత్రిక “హిందుస్థాన్ టైమ్స్“(Hindustan Times) తమ ఫ్రంట్ పేజీని పూర్తిగా తలైవా ఫొటోతో ముద్రించడం ప్రత్యేకంగా నిలిచింది.
పత్రిక స్థాపించి వందేళ్లు అయినా ఒకే హీరోకు ఇలాంటి పేజీ మొత్తం అంకితం చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ALSO READ:iBomma One Piracy Site: ఆగని పైరసీ… కొత్తగా ‘iBomma One’ సైట్ గుర్తింపు
సినీ పరిశ్రమలో రజనీకాంత్ 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక గౌరవాన్ని అందించామని హిందుస్థాన్ టైమ్స్ ప్రకటించింది. నవంబర్ 19న వెలువడిన పేపర్‌లో రజనీ పూర్తి పేజీ ఫొటో చూసి పాఠకులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తంచేశారు. ఇది అభిమానుల ప్రేమకు ప్రతీకగా నిలిచిందని స్పందించారు.
ఈ గౌరవంపై రజనీకాంత్ కూడా స్పందిస్తూ అద్భుతమైన సర్‌ప్రైజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన హృదయం ఆనందంతో నిండిపోయిందని, అభిమానులు చూపుతున్న మద్దతు తనకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
1975లో ‘అపూర్వ రాగంగళ్’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రజనీకాంత్ ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలతో అపారమైన అభిమానులను సంపాదించారు. ఇక ఈ నెలలో గోవాలో జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2025) ముగింపు వేడుకల్లో ఆయనకు ప్రత్యేక సన్మానం ఏర్పాటు చేస్తున్నారు.
