భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం (India US Trade Deal) పై చర్చలు తుది దశకు చేరుకున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్(Minister Piyush Goyal ) తెలిపారు. ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఆర్థిక సదస్సులో మాట్లాడిన ఆయన, ఒప్పందం న్యాయంగా, సమానంగా, రెండు దేశాలకు సమతుల్యంగా ఉన్నప్పుడు అధికారిక ప్రకటన విడుదలవుతుందని సూచించారు.
రైతులు, మత్స్యకారులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలను దృష్టిలో ఉంచి చర్చలు కొనసాగుతున్నాయని గోయల్ స్పష్టం చేశారు.
ఇప్పటికే ఆరు రౌండ్ల సంప్రదింపులు పూర్తయ్యాయని, ఇరు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులు వంటి దీర్ఘకాలిక ఒప్పందాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయని తెలిపారు.
ALSO READ:Film Chamber:iBomma రవిని ఎన్ కౌంటర్ చేయాలి
2030 నాటికి ప్రస్తుత 191 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచడం లక్ష్యంగా ఇరుదేశాలు ముందుకు సాగుతున్నాయి.
అమెరికా బాదం, పిస్తా, యాపిల్స్ వంటి ఉత్పత్తులకు భారత మార్కెట్లో ప్రవేశం కోరుతున్న విషయం కూడా చర్చలలో భాగమైంది. వరుసగా నాలుగోసారి 2024–25లో అమెరికా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది.
