బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Election Results) అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నేత అనంత్ సింగ్(Anant Singh) జైలు నుంచే విజయం సాధించారు.మొకామా నియోజకవర్గంలో ఆయన సంచలన విజయం నమోదు చేశారు. హ*త్య కేసులో ఆయన జైలు పాలైనప్పటికీ మొకామా ఓటర్లు ఆయనకే ఓటేసి గెలిపించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) అభ్యర్థి దులార్ చంద్ యాదవ్ హ*త్యకు గురయ్యాడు. ఈ హ*త్యలో అనంత్ సింగ్ పాత్ర ఉందని, ఆయన అనుచరులే దులార్ చంద్ ను చంపేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ALSO READ:Crow Incident Fire:కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు
ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రాథమిక ఆధారలు సేకరించిన పోలీసులు అనంత్ సింగ్ ను పోలింగ్ కు కొన్ని రోజుల ముందే అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అనంత్ సింగ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మొకామా నుంచి నామినేషన్ దాఖలు చేసి ప్రచారం కూడా చేపట్టారు.
ఈ హ*త్య కేసులో అనంత్ సింగ్ ను అదుపులోకి తీసుకోవడంతో ఆయన గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ అనంత్ సింగ్ కటకటాల వెనక ఉన్నప్పటికీ మొకామా నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
