Sunday, March 29, 2026
Chat on WhatsApp
HomeUncategorizedరిషబ్ పంత్ 18వ నెంబర్ జెర్సీతో బరిలోకి – సోషల్ మీడియాలో హీట్

రిషబ్ పంత్ 18వ నెంబర్ జెర్సీతో బరిలోకి – సోషల్ మీడియాలో హీట్

-

Chat on WhatsApp

దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ ‘ఏ’ జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టిన రిషబ్ పంత్ మరోసారి చర్చనీయాంశంగా మారాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న పంత్, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో మొదలైన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, మ్యాచ్ కంటే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది అతడు ధరించిన జెర్సీ. పంత్ సాధారణంగా 17వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగుతాడు కానీ, ఈసారి మాత్రం 18వ నెంబర్ జెర్సీతో మైదానంలో అడుగు పెట్టాడు.

ఈ జెర్సీపై అభిమానుల దృష్టి పడటానికి కారణం – అది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన నెంబర్ కావడం. కోహ్లీ ఇటీవల టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో రిషబ్ పంత్, అందుబాటులో ఉన్న 18వ నెంబర్ జెర్సీని ధరించాడు. సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చగా మారింది. కొందరు అభిమానులు “కోహ్లీ లెగసీ కొనసాగించడానికి పంత్ సరైన వ్యక్తి” అంటుంటే, మరికొందరు “కోహ్లీ నెంబర్‌ను రిటైర్ చేయాల్సింది” అని వ్యాఖ్యానిస్తున్నారు.

గతంలో ముఖేశ్ కుమార్ కూడా భారత ‘ఏ’ జట్టు తరఫున ఆడినప్పుడు ఇదే నెంబర్ జెర్సీని ధరించాడు. ఇకపోతే బీసీసీఐ గతంలో సచిన్ టెండుల్కర్ (10), ఎంఎస్ ధోనీ (7) లాంటి దిగ్గజాల జెర్సీలను రిటైర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కోహ్లీ విషయంలో మాత్రం ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదు. టెస్టులకు గుడ్‌బై చెప్పినా, వన్డేలు, టీ20ల్లో కొనసాగుతున్నందున 18వ నెంబర్ అందుబాటులో ఉందని భావిస్తున్నారు. రిషబ్ పంత్ జెర్సీతో సోషల్ మీడియాలో #Pant18 మరియు #KohliLegacy అనే హ్యాష్‌ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana cm revanth reddy launching tholi mudda breakfast scheme for anganwadi children in assembly premises

Anganwadi Breakfast Scheme | సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త పథకం.....

Anganwadi Breakfast Scheme: తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని మెరుగుపరచే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ‘తొలి ముద్ద’(Tholi Mudda) పేరుతో ప్రత్యేక...
- Advertisement -
Chat on WhatsApp