Saturday, February 21, 2026
spot_img
HomeAndhra Pradeshచంద్రగిరిలో చోరీ కేసు భేదం, ఇద్దరు అరెస్ట్

చంద్రగిరిలో చోరీ కేసు భేదం, ఇద్దరు అరెస్ట్

చంద్రగిరి మండలం కొత్త ఇండ్లు గ్రామంలోని శిద్దులు నాయుడు ఇంటిలో 2023 నవంబర్ 30న పగటిపూట జరిగిన చోరీ కేసులో చంద్రగిరి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించి మొత్తం 301 గ్రాముల బంగారం, రూ.3 లక్షల నగదు, ఓ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.

తిరుపతి రూరల్ శ్రీనగర్ కాలనీకి చెందిన పులి నరేష్‌ ను పోలీసులు అరెస్ట్ చేయగా, అతని వద్ద నుండి 195.5 గ్రాముల బంగారం, రూ.3 లక్షలు, ఓ స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. నరేష్‌పై ఇదివరకు కూడా అనేక కేసులు నమోదు కావడంతో అతని జైలు జీవితం కొనసాగుతోంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్నాడు జిల్లా మిర్యాలకు చెందిన షేక్ బాబావలి కాగా, అతడిని సూర్యాపేట జిల్లా మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుండి మరో 105.5 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు పరిష్కారానికి కృషిచేసిన చంద్రగిరి ఇన్‌స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి నేతృత్వంలోని పోలీస్ సిబ్బందికి తిరుపతి రూరల్ డీఎస్పీ బేతంపూడి ప్రసాద్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular