ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గతంలో పాత కక్షల కారణంగా సంజయ్ మరియు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ గొడవలో సంజయ్, మనోజ్, సంజీవ్ లతో ఉన్న కేసు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది.
ఈ కేసులో పెద్దలు మధ్యలో చేరి, 3 లక్షల రూపాయలు సంజయ్‌కు ఇమ్మని సమస్య పరిష్కరించారు. కానీ సంజయ్, ఈ సమస్యపై సమయం గడిచిన తరువాత తన తోటి స్నేహితులతో కలిసి మనోజ్‌ను విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపడం జరిగిందని పోలీసులు తెలిపారు.
మధు అనే స్నేహితుడు ఈ సంఘటనను పోలీసులకు వెల్లడించాడు. ఈ ఘటనపై చైతన్యపురి సీఐ వెంకటేశ్వర్లు స్పందించి, చనిపోయిన మనోజ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అలాగే కేసు నమోదు చేసి, చంపిన వారిపై దర్యాప్తు చేపట్టారు.
ఇప్పటికే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ హత్య వెనుక ఉన్న పాత కక్షలను పరిశీలిస్తూ, మరిన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు చెప్పారు.
