అదిలాబాద్ జిల్లాలో 411 కేజీల గంజాయిని దహనం

In Adilabad district, authorities incinerated 411 kilograms of cannabis in Nizamabad, following orders from higher officials. The destroyed drugs were seized in various cases, valued at around ₹1 crore. In Adilabad district, authorities incinerated 411 kilograms of cannabis in Nizamabad, following orders from higher officials. The destroyed drugs were seized in various cases, valued at around ₹1 crore.

అదిలాబాద్ జిల్లాలో 48 కేసుల్లో 411 కేజీల గంజాయిని నిజామాబాదులో దహనం చేశారు. వివిధ కేసుల్లో పట్టుకున్నటువంటి గంజాయిని దహనం చేయాలని ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు అదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి అదిలాబాద్ పిచ్చోడు ఉట్నూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి 411 కేజీల గంజాయిని నిజామాబాద్ జిల్లాలోని శ్రీ మెడికేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ గంజాయిని దగ్ధం చేసినట్లు ఆదిలాబాద్ డిప్యూటీ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు.

దగ్ధం చేసిన గంజాయి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని అధికారులు తెలిపారు. అదిలాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 340 కేజీలు ఇచ్చోడులో 37 కేజీలు ఉట్నూర్ లో 33 కేజీల గంజాయిని డిస్ట్రాయిడ్ చేశారు. ఈ గంజాయిని ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ హిమశ్రీ, పోలీస్ స్టేషన్లో సిఐలు కలిసి దహనం చేశారు. వివిధ కేసుల్లో పట్టుకున్నటువంటి గంజాయిని దహనం చేసినటువంటి అదిలాబాద్ ఎక్సైజ్ అధికారులకు సిబ్బందికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *