సులభంగా డబ్బు సంపాదించడంతో తన అవసరాల కోసం ఒక అడుగు ముందుకేసి తన ఇంటి మేడపైన గంజాయి మొక్కల పెంపకాన్ని గృహ పరిశ్రమగా ప్రారంభించి చివరికి పోలీసులకు చిక్కి కటాకటాలు పాలైనాడు. ఓ వ్యక్తి…
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్స్ టీం ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ లో పోలీస్ జాగిలంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా యాంటీ డ్రగ్స్ టీం ఇంచార్జి ఇన్స్ స్పెక్టర్ సురేష్ ప్రయాణికులతో మాట్లాడుతూ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు రహస్యం గంజాయి లాంటి మత్తు పదార్థాలను అక్రమ చేస్తున్న, విక్రయిస్తున్న, వినియోగిస్తున్న తక్షణమే 8712584473 సెల్ నంబర్ కు సమాచారం అందించాలని. సమాచారం అందించిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడుతాయని తెలిపారు. ఈ తనిఖీల్లో యాంటీ డ్రగ్స్ టీమ్ ఇన్స్పెక్టర్స్ జె సురేష్, ఆర్ఐ శివ కేశవులు, ఆర్ ఎస్ఐ పూర్ణ చంద్రా రెడ్డి , ఎస్ఐ చాంద్ పాషా, ఏఎస్ఐ సాంబయ్య, సిబ్బంది పాల్గొనడం జరిగింది.
మేడపైన గంజాయి మొక్కలు పెంపకం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
