Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshక్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కడప ఏఈ నాగరాజు మృతి

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కడప ఏఈ నాగరాజు మృతి

-

Chat on WhatsApp

కడప ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా (ఏఈ) పనిచేస్తున్న నాగరాజు (42) ఆదివారం ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. కడపలోని KSRM ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.

నాగరాజును కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆయనను పరీక్షించి మరణించినట్లు ప్రకటించారు. ఆయనకు ఇటీవలే ఆరోగ్య సంబంధిత సమస్యలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆకస్మిక గుండెపోటుతో మరణించడం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈయనకు త్వరలో డిప్యూటీ ఇంజినీర్ (డీఈ)గా ప్రమోషన్ రానుందని సమాచారం. పదోన్నతిని అందుకునే ముందే మృత్యువు పలకరించడం తో సహోద్యోగులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణం ఇరిగేషన్ శాఖలో విషాదాన్ని నింపింది.

నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని సహోద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆకస్మిక గుండెపోటుతో మరణించే సంఘటనలు పెరుగుతున్నాయని, ఉద్యోగస్తులు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

rajnath singh warning pakistan over bengal and kolkata threat

Rajnath Singh | 1971 యుద్ధాన్ని గుర్తు చేసిన రాజ్‌నాథ్…వార్నింగ్ ఇస్తూ…చరిత్ర రిపీట్ అవుద్ది

Rajnath Singh: పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ కోల్‌కతాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. “బెంగాల్‌పై కన్నేస్తే, ఈసారి పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో...
- Advertisement -
Chat on WhatsApp