మన ఆదోని మున్సిపాలిటీని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మన భారత దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే పార్థసారధి గారు అన్నారు.
మంగళవారం పురపాలక సంఘం కార్యాలయం నుండి ఎమ్మిగనూరు సర్కిల్ వరకు స్వచ్చ హి సేవ అనే కార్యక్రమం ద్వారా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆదోని పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మన చుట్టుపక్కల పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందని అన్నారు ప్లాస్టిక్ కవర్లో పదార్థాలు వాడడం తగ్గించాలి మరి కొన్ని రోజుల్లో ఆదోని పట్టణంలో ప్లాస్టిక్ రహిత్ ఆదోనిని నిర్మిస్తాం అని ఎమ్మెల్యే ఆశ భావం వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ గారు తెచ్చిన స్వచ్ఛభారత్ కార్యక్రమo ద్వారా మన దేశ పురోగతి భారీ స్థాయిలో పెరుగుతుందని ఎమ్మెల్యే ఎద్దేవ చేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ TPO మరియు మున్సిపల్ సిబ్బంది మేపాం మహిళలు పాల్గొన్నారు