Sunday, March 22, 2026
Google search engine
HomeFilms NewsVaranasi Release Date: రిలీజ్ డేట్ ట్వీట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘వారణాసి’ టీమ్

Varanasi Release Date: రిలీజ్ డేట్ ట్వీట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘వారణాసి’ టీమ్

-

Google search engine

Mahesh Babu-Rajamouli: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం, అప్పుడే 2027లో విడుదల చేస్తామని వెల్లడించింది.

అయితే రాజమౌళి(SS Rajamouli) సినిమాలు సాధారణంగా అనుకున్న సమయానికి విడుదల కావు అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండటంతో, ఈ రిలీజ్ డేట్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ‘వారణాసి’ టీమ్ మరోసారి స్పందించింది. 2027లోనే సినిమా విడుదల(Varanasi Release Date) అవుతుందని స్పష్టం చేస్తూ అధికారికంగా ట్వీట్ చేసింది. దీంతో రిలీజ్ డేట్‌పై మరోసారి క్లారిటీ వచ్చినట్లయింది.

ALSO READ:T20 World Cup: అయోమయంలో బంగ్లా జట్టు.. వరల్డ్‌కప్‌లో ఆడేది డౌటే

అయితే కొందరు అభిమానులు ఈ చిత్రాన్ని ఉగాది లేదా శ్రీరామనవమి కానుకగా విడుదల చేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆ పండుగలకు ఇంకా ఒక ఏడాది మాత్రమే సమయం ఉండటంతో, షూటింగ్ పూర్తి అవుతుందా అన్నదానిపై చర్చ కొనసాగుతోంది.

సోషల్ మీడియాలో మహేశ్ అభిమానులు, నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. “2027 రిలీజ్ అంటే ఇంకా నమ్మలేకపోతున్నాం”, “సమయం తీసుకున్నా సరే ఓ లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియన్స్ మూవీ ఇవ్వాలి” అంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఈ సినిమాలో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

మరో విశేషం ఏమిటంటే, మహేశ్ బాబు కొద్దిసేపు రాముడి పాత్రలో కూడా కనిపిస్తారని రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ భారీ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine