Wednesday, March 25, 2026
Chat on WhatsApp
HomeInterNationalఅమెరికాలో మంచు తుపాను.. 8 వేల విమాన సర్వీసులు రద్దు

అమెరికాలో మంచు తుపాను.. 8 వేల విమాన సర్వీసులు రద్దు

-

Chat on WhatsApp

USA Winter Storm: అమెరికాను భారీ మంచు తుపాను (Winter Storm) అతలాకుతలం చేస్తోంది. పలు రాష్ట్రాల్లో తీవ్ర మంచు, వర్షంతో పాటు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా టెక్సాస్, ఓక్లహోమా రాష్ట్రాలపై ఈ మంచు తుపాను పంజా విసురుతుండటంతో సాధారణ జీవనం స్థంభించింది.

ఈ భీకర వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్ అవేర్ వెల్లడించిన వివరాల ప్రకారం, శనివారం 3,200 విమాన సర్వీసులు, ఆదివారం 4,800 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మొత్తం మీద దాదాపు 8 వేల విమానాలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.

రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంచు తుపాను ప్రభావంతో అమెరికాలోని 20 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించారు.

అప్రమత్తం.. పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో కెంటకీ, వర్జీనియా, కాన్సస్, ఆర్కాన్సాస్, జార్జియా, మిసిసిపి సహా పలు రాష్ట్రాలు ఎమర్జెన్సీ ప్రకటించాయి. మిసిసిపి, ఫ్లోరిడా వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రమాదకర చలి కొనసాగుతుందని, మిస్సోరి, ఇల్లినాయిస్ రాష్ట్రాల్లో భారీగా మంచు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇది ఈ దశాబ్దిలోనే అత్యంత తీవ్రమైన మంచు తుపానుగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.

ALSO READ:Union Budget 2026: ట్యాక్స్ పేయర్లకు పెద్ద ఊరట?.. టాప్ 13 మార్పులు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

people at petrol bunks in hyderabad amid rumors of fuel shortage with police warning

Hyderabad Petrol | హైదరాబాద్‌లో పెట్రోల్ కొరత లేదు.. బాటిళ్లలో అమ్మితే చర్యలు తప్పవు

Hyderabad Petrol: హైదరాబాద్‌లో ఇంధన కొరత ఉందన్న వార్తలను పోలీసులు ఖండించారు. నగరంలో పెట్రోల్, డీజిల్ సరిపడా నిల్వలు ఉన్నాయని, సుమారు 60 రోజుల అవసరానికి సరిపడే స్టాక్ అందుబాటులో ఉందని పోలీస్...
- Advertisement -
Chat on WhatsApp