Wednesday, March 25, 2026
Chat on WhatsApp
HomeInterNationalUSA Immigration | ఐదేళ్ల చిన్నారిని నిర్బంధించిన అధికారులు

USA Immigration | ఐదేళ్ల చిన్నారిని నిర్బంధించిన అధికారులు

-

Chat on WhatsApp

USA Immigration: అమెరికాలో వలసదారులపై అమలు చేస్తున్న కఠిన చర్యల నేపథ్యంలో, తాజాగా కలకలం రేపిన ఘటన బయటపడింది. మిన్నెసోటాలో ప్రీస్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తున్న ఐదేళ్ల బాలుడిని, అతడి తండ్రిని ఫెడరల్ ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

బాలుడిని అతడి తండ్రితో కలిసి టెక్సాస్‌లోని ఓ నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు ప్రీస్కూల్ అధికారులు, బాధిత కుటుంబ న్యాయవాది వెల్లడించారు.

స్కూల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, నిర్బంధానికి గురైన బాలుడి పేరు లియామ్ కోనెజో రామోస్. 2024లో ఈ చిన్నారి కుటుంబం అమెరికాకు వలస వచ్చినట్లు తెలిపారు. అయితే, ఈ కుటుంబంపై బహిష్కరణకు సంబంధించిన ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ కాలేదని పేర్కొన్నారు.

ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నారిని స్కూల్ నుంచి వెళ్తున్న సమయంలోనే అదుపులోకి తీసుకోవడంపై మానవ హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పిల్లల భద్రత, హక్కులపై ఇది తీవ్ర ప్రభావం చూపే అంశమని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం వలసదారులపై కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో, ఈ ఘటన ఆ విధానాలపై మరింత చర్చకు దారితీస్తోంది. చిన్నారులపై కూడా ఇమిగ్రేషన్ చర్యలు అమలు చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

also read:Manchu Manoj | మాస్ అవతార్‌లో మంచు మనోజ్.. ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ప్రకటన

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

people at petrol bunks in hyderabad amid rumors of fuel shortage with police warning

Hyderabad Petrol | హైదరాబాద్‌లో పెట్రోల్ కొరత లేదు.. బాటిళ్లలో అమ్మితే చర్యలు తప్పవు

Hyderabad Petrol: హైదరాబాద్‌లో ఇంధన కొరత ఉందన్న వార్తలను పోలీసులు ఖండించారు. నగరంలో పెట్రోల్, డీజిల్ సరిపడా నిల్వలు ఉన్నాయని, సుమారు 60 రోజుల అవసరానికి సరిపడే స్టాక్ అందుబాటులో ఉందని పోలీస్...
- Advertisement -
Chat on WhatsApp