Saturday, March 21, 2026
Google search engine
HomeInterNationalTrump Crypto Deal | క్రిప్టో మార్కెట్‌లో ట్రంప్ ప్రభావం.. యూఏఈతో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్...

Trump Crypto Deal | క్రిప్టో మార్కెట్‌లో ట్రంప్ ప్రభావం.. యూఏఈతో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ డీల్

-

Google search engine

Trump Crypto Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయన కుటుంబానికి భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రిప్టో మార్కెట్‌లో గణనీయమైన ఉత్సాహం కనిపిస్తోంది. బిట్‌కాయిన్(Bitcoin) సహా పలు డిజిటల్ కరెన్సీల విలువలు పెరగడంతో పాటు ట్రంప్ కుటుంబ వ్యాపారాలకు అంతర్జాతీయంగా కీలక ఒప్పందాలు కుదురుతున్నాయి.


తాజాగా ట్రంప్ కుటుంబానికి చెందిన ‘వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్’(World Liberty Financial ) సంస్థ యూఏఈలోని అబుదాబీ రాజ కుటుంబానికి చెందిన షేక్ తహనూన్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ ప్రతినిధులతో భారీ క్రిప్టో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో 49 శాతం వాటాను యూఏఈ ప్రతినిధులు కొనుగోలు చేశారు.

ఇందులో ముందస్తు చెల్లింపుల ద్వారా ట్రంప్ కుటుంబానికి సుమారు 187 మిలియన్ డాలర్లు అందనున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ ఒప్పందంపై ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ సంతకం చేశారు.

ఈ డీల్ ద్వారా అమెరికా నుంచి యూఏఈకి ఏఐ హార్డ్‌వేర్ సరఫరా జరగనుంది. గతంలో జో బైడెన్ పాలనలో విఫలమైన ఈ ప్రయత్నాలు ట్రంప్ పాలనలో వేగంగా ముందుకు సాగుతున్నాయి. 2024లో ప్రారంభమైన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ ఇప్పటికే పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకోగా, యూఏఈ డీల్ ట్రంప్ కుటుంబానికి క్రిప్టో రంగంలో మరింత బలాన్ని చేకూర్చనుంది.

also read:Jammu and Kashmir Earthquake | జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. తెల్లవారుజామున భయాందోళన

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine