Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeTechnology NewsTesla Model Y 15 నిమిషాల్లో 275 km రేంజ్ – కొత్త ఛార్జింగ్ సదుపాయం

Tesla Model Y 15 నిమిషాల్లో 275 km రేంజ్ – కొత్త ఛార్జింగ్ సదుపాయం

-

Chat on WhatsApp

Tesla Model Y 15: నవి ముంబైలో నెక్సస్ సీవుడ్స్ మాల్(Nexus Seawoods Mall) లో టెస్లా తొలి ఇన్-మాల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభమైంది. మొత్తం 8 ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. 4 వి4 సూపర్ ఛార్జర్లు (250 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జింగ్) మరియు 4 డెస్టినేషన్ ఛార్జర్లు (11 కిలోవాట్ల ఏసీ).

వి4 సూపర్ ఛార్జర్ ద్వారా Tesla Model Y 15 నిమిషాల్లో సుమారు 275 కిలోమీటర్ల రేంజ్ పొందుతుంది. సదుపాయం మాల్ B1 పార్కింగ్‌లో ఏర్పాటు చేసి, వినియోగదారులు షాపింగ్, హైవే స్టాప్‌లు, ఫుడ్ కోర్ట్‌లలో సమయాన్ని తగ్గించుకుని వాహనాన్ని చార్జ్ చేసుకోవచ్చు.

“టెస్లా యాప్ ద్వారా యూజర్లు ఛార్జింగ్ స్టేషన్ స్థానం, ఖాళీ స్లాట్లు, బ్యాటరీ ప్రీ-కండిషన్, ఛార్జింగ్ ప్రోగ్రెస్, నోటిఫికేషన్లు, చెల్లింపులు—అన్ని ఒకే ప్లాట్‌ఫాం‌లో సులభంగా నిర్వహించవచ్చు.

ఈ స్టేషన్‌తో భారత్‌లో టెస్లా నెట్‌వర్క్ 4 స్టేషన్లకు చేరింది (మొత్తం 20 సూపర్, 14 డెస్టినేషన్ ఛార్జర్లు). Model Y ప్రారంభ ధర రూ.59.89 లక్షలు, హోమ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

సూపర్ ఛార్జర్ ఒక్క యూనిట్ రూ.24, డెస్టినేషన్ ఛార్జర్ ఒక్క యూనిట్ రూ.14. మాల్‌లో పాప్-అప్ స్టోర్ ద్వారా టెస్ట్ డ్రైవ్, టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్స్ తెలుసుకోవచ్చు. టెస్లా భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచేందుకు కీలక అడుగు వేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

dgp shivadhar reddy convoy minor accident near mulugu

DGP Convoy Trial Run | డీజీపీ కాన్వాయ్ ట్రయల్ రన్…తప్పిన పెను ప్రమాదం

DGP Convoy Trial Run: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) శివధర్ రెడ్డి ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నప్పుడు చిన్న ప్రమాదం చోటుచేసుకుంది....
- Advertisement -
Chat on WhatsApp