భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కుట్ర చేసే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్(PAKISTAN)కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (JeM) దేశంలోని పలు ప్రాంతాలపై దాడి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించాయి.
జనవరి 26న భారీ దాడులు చేపట్టేందుకు ‘26-26’ అనే కోడ్ నేమ్‌ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ కుట్రకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI) సహకరిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ తెలిపాయి.
ఈ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు ప్రాంతాలతో పాటు జమ్మూ కశ్మీర్(KASHMIR), దిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.
ALSO READ:Rupee Value Today: రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠం…డాలర్‌తో మారకం రేటు 91.74కి చేరింది
గణతంత్ర వేడుకలకు అంతరాయం కలిగించేలా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో దిల్లీ పోలీసులు పలువురు అనుమానితుల ఫొటోలతో వాంటెడ్ నోటీసులు జారీ చేశారు. వారిని ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ జమ్మూ కశ్మీర్, పంజాబ్, దిల్లీ, హరియాణా రాష్ట్రాల యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భద్రతా వ్యవస్థలు పూర్తి అప్రమత్తతతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.







