TDP second candidate list: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సందడి ఊపందుకుంది. నామినేషన్ల గడువు ముగియడానికి సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మరో కీలక జాబితాను విడుదల చేస్తూ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం మచిలీపట్నం కార్పొరేషన్‌తో పాటు మరో 21 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా షేక్ అబ్దుల్ అజీజ్‌ను ప్రకటించింది. ఆదోనికి నిలోఫర్ షేక్, బేతంచెర్లకు ఇ. రాకేష్ గౌడ్, బుచ్చిరెడ్డిపాలెంకు దొడ్డా విజయలక్ష్మి, చీరాలకు యెద్దుల హరి సుధన్, డోన్‌కు కొట్టె సుజాతమ్మ, గుత్తికి గొల్లపెద్దరాజులు, జంగారెడ్డిగూడెంకు రొంగల అనూష పేర్లను వెల్లడించింది.
అలాగే కదిరికి షేక్ సమీరా, కళ్యాణదుర్గానికి బుట్టి లక్ష్మి, కొండపల్లికి కన్నెకంటి అమూల్య, కొవ్వూరుకు జొన్నలగడ్డ రాధారాణి, నందిగామకు శాకమూరి వర్షధర్, నందికొట్కూరుకు నుంచి ఈ.ఎం. సుబ్బన్నస్వామి, నరసీపట్నం నుంచి చింతకాయల పద్మావతి, జగ్గయ్యపేట నుంచి నంద్యాల రామస్వామిరెడ్డి, వెంకటగిరి నుంచి దొంతు శారద, ఉదయగిరి నుంచి చేదిరెడ్డిపాటి ప్రవీణ్ కుమార్, ఎలేశ్వరం నుంచి యారగడ్డ అక్షిత, ఎమ్మిగనూరు నుంచి మాచాని సునీతను టీడీపీ అభ్యర్థులుగా ఖరారు చేసింది. అయితే గుంటూరు, ఒంగోలు మేయర్ అభ్యర్థుల ఎంపికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఆశావహుల సంఖ్య, రాజకీయ సమీకరణాలు, కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన స్థానాలకు టీడీపీ ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తంగా, అభ్యర్థుల ఎంపికతో ఎన్నికల పోరు మరింత వేడెక్కగా, కీలక నగరాల్లో టీడీపీ ఎవరికి అవకాశం ఇస్తుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మిగిలిన స్థానాల ప్రకటనతో ఎన్నికల సమీకరణాలు మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.
టీడీపీ తొలి జాబితా.. బీసీ, మహిళలకు పెద్దపీట!
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల కోసం టీడీపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఏడు కార్పొరేషన్ల మేయర్, 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ అభ్యర్థులుగా మొత్తం 36 మందిని ప్రకటించింది. వీరిలో 22 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారు కాగా, 16 మంది బీసీలకు అవకాశం కల్పించింది. అలాగే 19 మంది మహిళలకు చోటు దక్కింది.
మేయర్ అభ్యర్థులు: చిత్తూరు – కటారి హేమలత, కడప – డాక్టర్ నెల్లటూరి సువర్ణ, కర్నూలు – విజయ ప్రత్యాశ, నెల్లూరు – పోలబోయిన రూప్ కుమార్, తిరుపతి – మన్యం శ్రీనివాస ప్రసాద్, విశాఖపట్నం – డాక్టర్ ముక్కా శ్రావణి, విజయనగరం – అవనపు భార్గవి.
మున్సిపాలిటీలు, నగర పంచాయతీల అభ్యర్థులు: ఆళ్లగడ్డ – అనీషా షేక్, అద్దంకి – కాకాని అశోక్, ఆదోని – నాగమణి, బద్వేల్ – సోమశిల దివ్య తేజ, బొబ్బిలి – రేణుకా దేవి స్వప్న, ధర్మవరం – పరిస సుధాకర్, హిందూపురం – పి.ఎస్. మంజునాథ్, కుప్పం – ఎస్. రాజకుమార్, మాచర్ల – ఏనుముల సుష్మ, మదనపల్లె – శ్రీరామ్ చిన్న బాబు, నగరి – శ్రీనివాసన్, మార్కాపురం – వక్కలగడ్డ మల్లికార్జున, పలాస కాశీబుగ్గ – వజ్జా గంగాభవాని, పులివెందుల – తుగుట్ల గీతా కుమారి, రాజంపేట – డాక్టర్ దొంతం గాయత్రి, రాయచోటి – ఖాదర్ వలి షేక్, రేపల్లె – కె. అపర్ణ తదితరులకు అవకాశం కల్పించింది.
ALSO READ: Supreme Court | ఇంటర్నెట్ పిల్లల ప్రాథమిక హక్కు.. ఇంటర్నెట్పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
