Modi Israel Visit | 2017 తర్వాత మళ్లీ ఇజ్రాయెల్‌కు మోదీ..భారత్–ఇజ్రాయెల్ బంధానికి కొత్త బలం
Modi Israel Visit: భారత ప్రధాని “నరేంద్ర మోదీ” వచ్చే వారం ఇజ్రాయెల్‌కు అధికారిక పర్యటన చేయనున్నట్లు సమాచారం. రక్షణ, ఉగ్రవాద నిరోధక చర్యలు, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత వంటి కీలక రంగాల్లో భారత్–ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇజ్రాయెల్‌కు వెళ్లడం ఇదే తొలిసారి కాగా, 2017 తర్వాత ఆ దేశాన్ని సందర్శించడం విశేషం….
