Shamshabad Airport bomb threat: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచిహెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కోవైట్ నుంచి హైదరాబాదుకు రానున్న KU-373 ఫ్లైట్‌కు బెదిరింపు మెయిల్ రావడంతో, సేఫ్టీ ప్రోటోకాల్ మేరకు విమానం మస్కట్‌కు మళ్లించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకున్నామని విమానయాన అధికారులు వెల్లడించారు.
అదే సమయంలో లండన్ నుంచి హైదరాబాదుకు వచ్చే బ్రిటిష్ ఎయిర్‌వేస్ BA-277 ఫ్లైట్‌కూ ఇలాంటి బెదిరింపు మెయిల్ రావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది. సురక్షితంగా ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులను దించి అసోలేషన్ ఏరియాకు తరలించారు.
ALSO READ:కోహ్లీని దాటేసిన వైభవ్ సూర్యవంశీ….2025లో భారత్‌లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్
బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలు విమానాన్ని పూర్తిగా ఖాళీ చేసి తనిఖీలు కొనసాగిస్తున్నాయి. టర్మినల్ ప్రాంతంలో అదనపు భద్రత ఏర్పాటుచేశారు.
ఈ బెదిరింపు మెయిల్స్ మూలాన్ని గుర్తించేందుకు సైబర్, ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్త దర్యాప్తు చేపట్టాయి. కాసేపు ఆందోళన నెలకొన్నప్పటికీ, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు.
