Police Kishtayya Telangana Movement Tribute: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య(Police Kishtayya) వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి బాస్కర్, ముదిరాజ్ సంఘం నాయకులు గుంటుకు శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. పోలీస్ కిష్టయ్య త్యాగం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిందని నాయకులు పేర్కొన్నారు.
ALSO READ:Tamil Nadu Bride | మొదటి రాత్రే లైంగిక సంబంధానికి నిరాకరించిన వధువు…సైకోగా మారిన భర్త
తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కిష్టయ్య ఆశయాలు నెరవేరేలా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని వారు భావించారు. రాష్ట్ర ఉద్యమంలో ఆయన పోరాటం, త్యాగం నేటికీ ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, బీజేపీ శ్రేణులు మరియు పలువురు స్థానికులు పాల్గొని నివాళులు అర్పించారు.
