Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshచింతలపూడిలో జాతీయ లోక్ అదాలత్‌కు పిలుపు

చింతలపూడిలో జాతీయ లోక్ అదాలత్‌కు పిలుపు

-

Chat on WhatsApp

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం విలేఖరి ఎస్‌ఎం పాషా అందించిన సమాచారం ప్రకారం, చింతలపూడి కోర్టులో మే 10న రెండవ జాతీయ లోక్ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి సి హెచ్. మధుబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివాదాలు న్యాయస్థానంలో కాకుండా పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

చింతలపూడి, టీ నర్సాపురం, లింగపాలెం, కామవరపుకోట మండలాలలో సివిల్, క్రిమినల్, మైంటెనెన్స్, రెవిన్యూ విభాగాల్లో కలిపి దాదాపుగా 4000కు పైగా కేసులు ఉన్నాయని తెలిపారు. వీటిలో సివిల్ కేసులు ఎక్కువగా రాజీ సాధ్యమైనవే కావడంతో, కక్షిదారులు, బ్యాంకులు, పోలీసు అధికారులు, రెవిన్యూ శాఖ అధికారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఈ లోక్ అదాలత్‌కు సంబంధించి కేసులు ఉన్నవారికి ముందుగానే నోటీసులు జారీ చేస్తారని, అనంతరం ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మాధ్యమాల ద్వారా కేసులు పరిష్కరించబడతాయని పేర్కొన్నారు. కేసులు త్వరితగతిన పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నారని అన్నారు.

ఇటువంటి కార్యక్రమాలలో ప్రజలు భాగస్వామ్యం కావడం వల్ల సమయం, ధనం మరియు menthal stress తగ్గుతాయని జడ్జి మధుబాబు అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖ, రెవిన్యూ శాఖ అధికారులు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ప్రజలు రాజీపడిన కేసుల ద్వారా శాంతియుతంగా జీవించాలని, ఈ అవకాశాన్ని కోల్పోకూడదని సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deloitte hiring 50000 employees in india amid global tech layoffs and ai transition

Deloitte Hiring | లేఆఫ్స్ ఒకవైపు.. హైరింగ్ మరోవైపు.. భారత్‌పై డెలాయిట్ భారీ ఫోకస్

Deloitte Hiring: టెక్ రంగంలో ఒకవైపు భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా, మరోవైపు నియామకాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వెలువడగా, అదే...
- Advertisement -
Chat on WhatsApp