IPL 2026 Auction | 2026 ఐపీఎల్ వేలం..తుది జాబితాలో 350 మంది క్రికెటర్లు 

IPL 2026 Auction Players Final List IPL 2026 Auction Players Final List

IPL 2026 Auction Players Final List: 2026 ఐపీఎల్ సీజన్ ప్లేయర్ల వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. ఈసారి తుది జాబితాలో మొత్తం “350 మంది క్రికెటర్లు” ఉండగా, వీరిలో “240 మంది భారతీయ ఆటగాళ్లు” ఉన్నారు. మొత్తం 1390 మంది రిజిస్టర్ చేసుకున్నప్పటికీ, పరీక్షలు పూర్తయ్యాక 350 మందిని మాత్రమే షార్ట్‌లిస్ట్ చేశారు.

దక్షిణాఫ్రికా ఆటగాడు “క్వింటన్ డీకాక్”(Quinton de Kock) కోటి రూపాయల బేస్‌ప్రైజ్‌తో లిస్ట్‌లో చేరాడు. తాజా వన్డే సిరీస్‌లో పాల్గొన్న అతను వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ “స్టీవ్ స్మిత్” (Steve Smith)2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో అందుబాటులో ఉన్నాడు.

భారత క్రికెటర్లలో “పృథ్వీ షా”, “సర్ఫరాజ్ ఖాన్” 75 లక్షల బేస్‌ప్రైజ్‌పై వేలంలో పాల్గొంటున్నారు. విదేశీ ఆటగాళ్లలో కెమరూన్ గ్రీన్, జేక్ ఫ్రేజర్ మెక్‌గార్క్, డేవాన్ కాన్వే, డేవిడ్ మిల్లర్ వంటి స్టార్ ప్లేయర్లు 2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో లిస్ట్‌లో ఉన్నారు.

ఈసారి 21 మంది ఇంగ్లండ్ క్రికెటర్లు, 19 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు, 15 మంది సౌతాఫ్రికా ప్లేయర్లు వేలంలో పోటీపడుతున్నారు. కివీస్ తరఫున కాన్వే, రవీంద్రతో కలిసి మొత్తం 16 మంది ఉన్నారు. ఆఫ్ఘానిస్తాన్‌కు చెందిన గుర్బాజ్, నవీన్-ఉల్-హక్ సహా మొత్తం 19 మంది ప్లేయర్లు లిస్ట్‌లో ఉన్నారు.

జట్ల పర్స్‌మనీ ప్రకారం కోల్‌కతా నైట్‌రైడర్స్ ₹64.3 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ ₹43.4 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ₹25.5 కోట్లతో వేలంలో పాల్గొననున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *