Saturday, March 21, 2026
Google search engine
HomeNationalIndian Markets End in Green | లాభాలతో ముగిసిన సెన్సెక్స్ – నిఫ్టీ

Indian Markets End in Green | లాభాలతో ముగిసిన సెన్సెక్స్ – నిఫ్టీ

-

Google search engine

 Stock Market: బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, అలాగే భారత్–యూరోపియన్(India–EU) యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement)పై సానుకూల అంచనాలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని నింపాయి.


ఫలితంగా మార్కెట్లు రోజంతా బలంగా కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సరికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 487 పాయింట్ల లాభంతో 82,344.68 వద్ద స్థిరపడింది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 167 పాయింట్లు పెరిగి 25,342 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడం మార్కెట్ లాభాలకు ప్రధాన కారణంగా నిలిచాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరత్వం, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు కొనసాగడం కూడా దేశీయ మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. రాబోయే రోజుల్లో గ్లోబల్ సంకేతాలు, ఆర్థిక డేటా మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

also read:Sunetra Pawar | సునేత్ర పవార్ ఎన్సీపీ అధినేతగా?

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine