Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeBhadradriAswaraopeta(ST)పామాయిల్ ఫ్యాక్టరీ లో 2.5 మెగా వాట్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

పామాయిల్ ఫ్యాక్టరీ లో 2.5 మెగా వాట్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

-

Chat on WhatsApp

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ లో నూతనంగా నిర్మించిన 2.5 మెగా వాట్ పవర్ ప్లాంట్ ఈనెల 12వ తేదీన ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పవర్ ప్లాంట్ ను సందర్శించారు.

విజయదశమి రోజు నూతనంగా ఏర్పాటుచేసిన పవర్ ప్లాంట్ ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభం జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సమస్యలు కారణంగా పామాయిల్ ఫ్యాక్టరీ క్రషింగ్ కు అంతరాయం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం 36 కోట్లతో నూతన పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసిందని,రైతులకు పవర్ ప్లాంట్ నిర్మాణం శుభ పరిణామంగా చెప్పుకోవాలని కలెక్టర్ అన్నారు.

విజయదశమి రోజు రైతులందరూ తమ ఇంట్లో పండుగ జరుపుకోవాలని భావిస్తారని, కానీ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా రైతులందరూ పామాయిల్ ఫ్యాక్టరీ కి వచ్చి తమతోపాటు నూతన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనాలని రైతులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deloitte hiring 50000 employees in india amid global tech layoffs and ai transition

Deloitte Hiring | లేఆఫ్స్ ఒకవైపు.. హైరింగ్ మరోవైపు.. భారత్‌పై డెలాయిట్ భారీ ఫోకస్

Deloitte Hiring: టెక్ రంగంలో ఒకవైపు భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా, మరోవైపు నియామకాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వెలువడగా, అదే...
- Advertisement -
Chat on WhatsApp