Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshHindupur Siravaram Clash:సంతకాల కార్యక్రమం ఉద్రిక్తం – టీడీపీ, వైసీపీ గుంపుల మధ్య ఘర్షణ 

Hindupur Siravaram Clash:సంతకాల కార్యక్రమం ఉద్రిక్తం – టీడీపీ, వైసీపీ గుంపుల మధ్య ఘర్షణ 

-

Chat on WhatsApp

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం సిరవరం గ్రామంలో శనివారం వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వైసీపీ ఇన్‌చార్జ్ వేణు రెడ్డి, బాలకృష్ణ స్థానికుడు కాదని, కేవలం చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నాడని, అలాంటి నాయకుడికి ఓటు ఇవ్వొద్దని ప్రజలను కోరినట్లు సమాచారం.

ఈ వ్యాఖ్యలు తెలిసిన టీడీపీ కార్యకర్తలు తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యారు.

తరువాత రూరల్ పోలీస్‌స్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న వైసీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయంలోని కుర్చీలు, అద్దాలు, కూలర్లు సహా పలు వస్తువులు ధ్వంసం చేశారు.

ALSO READ:సీఐడీ సిట్ విచారణకు హాజరైన నటుడు రానా : CID SIT Rana Investigation

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి చేరుకున్న వైసీపీ కార్యకర్తలపై కూడా టీడీపీ గ్రూప్ దాడి చేసినట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఇరు గుంపులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతుండటంతో పోలీసులు పహారా బిగించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deloitte hiring 50000 employees in india amid global tech layoffs and ai transition

Deloitte Hiring | లేఆఫ్స్ ఒకవైపు.. హైరింగ్ మరోవైపు.. భారత్‌పై డెలాయిట్ భారీ ఫోకస్

Deloitte Hiring: టెక్ రంగంలో ఒకవైపు భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా, మరోవైపు నియామకాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వెలువడగా, అదే...
- Advertisement -
Chat on WhatsApp