Monday, March 23, 2026
Google search engine
HomeTelanganaHyderabadHigh Court Order on Pending Challans | పెండింగ్ చలాన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు

High Court Order on Pending Challans | పెండింగ్ చలాన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు

-

Google search engine

Pending Challans Case: పెండింగ్ చలాన్ల వసూలు విషయంలో వాహనదారులను బలవంతపెట్టవద్దని హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చలాన్లు చెల్లించాలని బైక్ కీలు లాక్కోవడం, వాహనాలను నిలిపివేయడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.

వాహన తనిఖీ సమయంలో వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లించేందుకు ముందుకు వస్తే మాత్రమే ట్రాఫిక్ పోలీసులు వసూలు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. చలాన్లు చెల్లించేందుకు వాహనదారులు నిరాకరిస్తే, చట్ట ప్రకారం కోర్టు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

ALSO READ:Lady Constable Jayasanti: చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్.. హోంమంత్రి అభినందనలు

ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు.

పెండింగ్ చలాన్ల పేరుతో వాహనదారులను రోడ్డుపై ఇబ్బందులకు గురి చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వాదనలు విన్న హైకోర్టు, వాహనదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ట్రాఫిక్ పోలీసులపై ఉందని వ్యాఖ్యానించింది. చలాన్ల వసూలు ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా, నిబంధనల ప్రకారం జరగాలని స్పష్టం చేస్తూ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine