Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeMedakMedakకాట్రియాల తండాలో ఘనంగా నిర్వహించిన దసరా ఉత్సవాలు

కాట్రియాల తండాలో ఘనంగా నిర్వహించిన దసరా ఉత్సవాలు

-

Chat on WhatsApp

మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తండా గ్రామంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి గిరిజన మహిళలు నీటిని తీసుకొని డబ్బు చప్పుళ్ళు, భక్తి గీతాలు భజన కీర్తనలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాతకు అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో బోగ్ బాండర్ హోమం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రతి సంవత్సరం గిరిజన తండాలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ పూజారి రాజు మహారాజ్ తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

hyderabad to srisailam helicopter service with vip temple darshan and scenic nallamala views

Srisailam Heli Tourism | హైదరాబాద్-శ్రీశైలం హెలీ సర్వీస్.. ఒక రోజు, రెండు రోజుల ప్రత్యేక...

Srisailam Heli Tourism | హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలను ప్రారంభించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ సన్నాహాలు వేగవంతం చేసింది. భక్తులకు వేగవంతమైన, విలాసవంతమైన, అలాగే ఆధ్యాత్మిక అనుభూతిని...
- Advertisement -
Chat on WhatsApp