Telangana Rising Summit Invitation: తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం చాల అవసరం ఉందని ముక్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మీడియా ముఖంగా తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi)తో అయిన సమావేశంలో రాష్ట్రానికి అవసరమైన ప్రధాన అంశాలను వివరించి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మోడీకి ఇచ్చిన సహకారం మాదిరిగా తెలంగాణకు కూడా కేంద్రం సహాయం అందించాలని కోరినట్లు చెప్పారు.
హైదరాబాద్–బెంగళూరు–చెన్నై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు కల్పించాలని, అలాగే ఆర్‌ఆర్‌ఆర్(RRR) సౌత్ ప్రాజెక్ట్‌కు అవసరమైన క్లియరెన్సులు ఇవ్వాలని ప్రధాని మోడీకి వినతులు చేసినట్టు వెల్లడించారు.
ALSO READ:Cyber Fraud:డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసాలు: అంతర్జాతీయ ముఠా అరెస్ట్
ఇటీవలి తన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ పార్టీ నిర్మాణంలో విభిన్న మనస్తత్వాలు ఉంటాయని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుల వయస్సు, బాధ్యతల సందర్భంలో చూపిన ఉదాహరణను అపార్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని భవిష్యత్తులో మరో రెండు టర్ములపాటు నడిపే బాధ్యత తనదే అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోడీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆహ్వానాలు అందజేశారు.
రాష్ట్ర అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ వివరాలు కూడా ఆహ్వాన పత్రికలో పంపినట్టు పేర్కొన్నారు.
