Monday, March 23, 2026
Google search engine
HomeAndhra Pradeshదావోస్‌లో సీఎం చంద్రబాబు బిజీబిజీ....ఏపీ–యూఏఈ ఆర్థిక భాగస్వామ్యం

దావోస్‌లో సీఎం చంద్రబాబు బిజీబిజీ….ఏపీ–యూఏఈ ఆర్థిక భాగస్వామ్యం

-

Google search engine

Andhra Pradesh–UAE Partnership: దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో కీలక సమావేశం నిర్వహించారు.

ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ – యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై విస్తృతంగా చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా యూఏఈలోని దుబాయ్ ఫుడ్ క్లస్టర్‌తో కలిసి పని చేయనున్నట్లు అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ వెల్లడించారు.

ALSO READ:Tamil Nadu Assembly: జాతీయ గీతం ఆలపించలేదని అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన తమిళనాడు గవర్నర్

అలాగే యూఏఈకి చెందిన సుమారు 40 కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ భాగస్వామ్యం ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గణనీయమైన ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొన్నారు. దావోస్ వేదికగా జరిగిన ఈ చర్చలు ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకంగా మారనున్నాయి.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine